మీపై కేసులు పెడితే.. నేనూ మీతోపాటు వ‌స్తా.. ప‌వ‌న్‌క‌ల్యాణ్

మాకు ఒక్క అవ‌కాశం ఇస్తే.. మార్పు అంటే ఏంటో చూపిస్తాం..

విజ‌య‌న‌గ‌రం (CLiC2NEWS): జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ విజ‌య‌న‌గ‌రం జిల్లా గుంక‌లాంకు వెళ్లారు. అక్క‌డ‌ నిర్మిస్తున్న జ‌గ‌నన్న కాలనీని ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌రిశీలించారు. అనంత‌రం అక్క‌డి ప్ర‌జ‌ల‌తో మాట్లాడుతూ.. రాజ‌ధాని పేరుతో ప్ర‌భుత్వం ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తుంద‌ని, వైఎస్ ఆర్ పార్టీ చేసే మోసాల్ని గ్ర‌హించాల‌న్నారు. ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు బ‌ల‌మైన రాజ‌కీయ అధికారం ద‌క్కాల‌న్నారు. మీ భ‌విష్య‌త్ కోసం న‌న్ను న‌మ్మండి, ఒక్క అవ‌కాశం ఇస్తే మార్పు అంటే చూపెడ‌తాం అన్ని ప‌వ‌న్ అన్నారు. మ‌త్స్య‌కారులు ఉపాధి కోసం గోవా, ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్తున్నార‌ని, జ‌న‌సేన పార్టీ అధికారంలోకి వ‌స్తే.. ఇక్క‌డే జెట్టీలు నిర్మించి వారి ఉపాధి అవ‌కాశాలు మెరుగుప‌రుస్తామ‌న్నారు. ఉత్త‌రాంధ్ర జ‌న‌సైనికులు ధైర్యంగా పోరాడండని.. అవినీతిపై రాజీలేని పోరాటం చేద్దామ‌ని పిలుపునిచ్చారు. మీపై కేసులు పెడితే మీతోపాటు నేనూ జైలుకొస్తాన‌ని ప‌వ‌న్ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.