కూచిపూడి నాట్యకారిణి శోభా నాయుడు కన్నుమూత
హైదరాబాద్ః ప్రముఖ కూచిపూడి నాట్యకళాకారిణి శోభా నాయుడు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించారు. 1956లో విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో జన్మించిన శోభా నాయుడు 12 ఏళ్ల వయసులోనే కూచిపూడిలో అరంగేట్రం చేశారు. వెంపటి చినసత్యం వద్ద శిష్యురాలిగా చేరిన ఆమె వెంపటి నృత్య రూపాలలో అన్ని పాత్రలను పోషించారు. సత్యభామ, పద్మావతి, చండాలిక పాత్రల్లో రాణించిన శోభా నాయుడు 2001లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం
శోభా నాయుడు మృతి పట్ల రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. శోభా నాయుడు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
శోభా నాయుడు వెంకట నాయుడు, సరోజినీ దేవి దంపతులకు విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో 1956లో జన్మించారు.శోభానాయుడు వెంపటి చిన సత్యం శిష్యురాలు. వెంపటి నృత్యరూపాలలో ఈమె అన్ని ప్రధాన పాత్రలనూ పోషించింది. చిన్నతనంలోనే ఆమె నృత్య నాటకాల్లో పాత్రలు పోషించడం మొదలుపెట్టింది. సత్యభామ, పద్మావతి, చండాలిక పాత్రల్లో ఆమె రాణించింది. స్వచ్ఛమైన నృత్యరీతి, అంకితభావం ఉన్న నాట్య గురువు. నాట్యం వృత్తిగా తీసుకున్న ప్రతిభాశాలి శోభానాయుడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శోభానాయుడు తన బహుముఖ ప్రతిభకు నిదర్శనంగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నది.
హైదరాబాదు లోని కూచిపూడి ఆర్ట్ అకాడమీ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తూ ద్వారా పిల్లలకు శిక్షణ నిస్తోంది. శోభానాయుడు శిష్యులు పలువురు రాష్ట్ర, జాతీయ పురస్కారాలను అందుకున్నారు.
- 2001 – పద్మశ్రీ పురస్కారం
- 1982 – మద్రాసు లోని కృష్ణ గానసభ వారి నుండి నృత్య చూడామణి
- 1998- ఎన్టీయార్ పురస్కారం
- 1990 – సంగీత నాటక అకాడమీ పురస్కారం
- 2011 – తంగిరాల కృష్ణప్రసాద్ స్మారక అవార్డులు అందుకున్నారు.
గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో 2020 అక్టోబర్ 13 అర్ధ రాత్రి 1:40కి తుదిశ్వాస విడిచారు. శోభానాయుడు మరణం తెలుగు ప్రజల కు తీరని లోటు.
-టి.వి.గోవిందరావు