పసిడి పరుగులు .. రికార్డు ధర పలుకుతున్న బంగారం
విజయవాడ (CLiC2NEWS): బంగారం ధర రికార్డు స్థాయిలో పెరుగుతుంది. డిసెంబర్ నెలలో స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ. 55,350 ఉండగా.. ప్రస్తుతం రూ. 58,770కు చేరింది. బంగారం ధర రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. 2020 ఆగస్టులో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,300 గా ఉంది. ఇప్పుడ మళ్లీ ఆదే స్ధాయికి చేరుకుంది. ప్రస్తుతం బంగారం ధరలో పెరుగుదల, అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా.. రానున్న రోజుల్లో బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.