Idupulapaya IIIT: ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
వేంపల్లె (CLiC2NEWS): చదువులో ఒత్తిడి భరించలేక ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వైఎస్ ఆర్ జిల్లా ఇడుపుల పాయలో చోటుచేసుకుంది. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటిలో ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నఅఖిల ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం క్యాంపస్‌లోని హాస్టల్ గదిలో సహ విద్యార్థినులు ఎవరూ లేని సమయంలో కిటికీకి చున్నీతో ఉరేసుకున్నట్లు సమాచారం. తోటి విద్యార్థులు తలుపు కొట్టినా ఎంతసేపటికి తీయకపోవడంతో భద్రతా సిబ్బందికి తెలిపారు. సిబ్బంది వెళ్లి చూడగా.. విద్యార్థి కిటికీకి వేలడుతూ విగతజీవిగా కన్పించింది. ఆర్‌జెయుకెటి ఉప కులపతి, కళాశాల డైరెక్టర్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కుమార్తె మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ట్రిపుల్ ఐటి విద్యార్థి అఖిల మృతికి ప్రేమ విఫలం కారణమనే ప్రాథమికంగా సమాచారం అందినట్లు కళాశాల డైరెక్టర్ చెప్పగా.. విద్యార్థి తల్లి దండ్రులు అది నిజం కాదని, తమ బిడ్డకు అలాంట ఆలోచనలు లేవని.. చదువులో ఒత్తిడి వల్లే ఇలా జరిగిందని.. తమ కుమార్తె ఫోన్ చేసినపుడల్లా ఈ విషయం చెప్పేదని పేర్కొన్నారు.