ప్రమాదానికి గురైన ట్రావెల్ బస్సు: 15 మందికి తీవ్రగాయాలు
ఆర్మూర్ (CLiC2NEWS): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ శివారు రోడ్డులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.
44వ జాతీయ రహదారిపై ఆగివున్న లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 38 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు రాయచూర్ నుంగడ హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రుతలను నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండి బస్సునడపడమే ప్రమాదానికి కారణమన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.