లిక్క‌ర్ కేసు: క‌విత‌కు ఇడి నోటీసులు

హైద‌రాబాద్ (CLiC2NEWS): దేశ‌వ్యాప్తంగా సంచ‌లనం సృష్టించిన ఢిల్లీ లిక్క‌ర్ కేసులో భార‌త్ రాష్ట్ర స‌మితి ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు ఇడి నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసులు ఎమ్మెల్సీ క‌విత మొద‌టి నుంచి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న విష‌యం తెలిసిందే. గురువారం ఢిల్లీలో విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని నోటీసుల్లో ఇడి పేర్కొంది. లిక్క‌ర్‌కేసు అరెస్ట‌యిన హైద‌రాబాద్ వ్యాపారి అరుణ్ రామ‌చంద్ర పిళ్లై.. ఎమ్మెల్సీ క‌విత‌కు బినామీ అని ఇడి మంగ‌ళ‌వారం న్యాయ‌స్థానికి తెలిపిన విష‌యం తెలిసిందే. రామ‌చంద్ర‌పిళ్లైతో పాటు క‌విత‌ను కూడా ఇడి అధికారులు విచారించ‌నున్న‌ట్లు స‌మాచారం. కాగా ఇడి నోటీసుల‌పై స‌ర్వ‌త్ర ఉత్కంఠ‌నెల‌కొంది.

Leave A Reply

Your email address will not be published.