1998 డిఎస్‌సి క్వాలిఫైడ్ అభ్య‌ర్థుల‌కు గుడ్‌న్యూస్‌

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఎపి ప్ర‌భుప్ర‌భుత్వం 1998 డిఎస్‌సి క్వాలిఫైడ్ అభ్య‌ర్థుల‌కు శుభ‌వార్త‌నందించింది. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో ఇచ్చిన మాట‌ను నిజంచేశారు. క్వాలిఫైడ్ అభ్య‌ర్థుల‌కు కాంట్రాక్టు ప‌ద్ధ‌తి ఎస్‌జిటీలుగా నియామ‌కం చేస్తూ బుధ‌వారం జీఓ ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 4,534 మంది క్వాలిఫైడ్ అభ్య‌ర్థులు కాంట్రాక్టు ప‌ద్ధ‌తిలోనియామ‌కం పొంద‌నున్నారు.వీరికి కౌన్స్‌లింగ్ నిర్వ‌హించి నియ‌క‌పు ఉత్త‌ర్వులు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. మార్చి నెలాఖ‌రులోగా నియామ‌క ప‌త్రాలు ఇవ్వ‌నున్నారు.

Leave A Reply

Your email address will not be published.