Rangareddy: భార్యను గొడ్డలితో నరికి, బిడ్డను సంపులో పడేసి..
రంగారెడ్డి (CLiC2NEWS): భార్యను గొడ్డలితో నరికిన భర్త.. 3 నెలల పసికందుని నీటి సంపులో పడవేసి హతమార్చాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అనాజ్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లావణ్య , ధన్‌రాజ్ దంపతులకు మూడేళ్ల కుమార్తె, 3 నెలల కుమారుడు ఉన్నాడు. బాలింతగా ఉన్న లావణ్యను ధన్‌రాజ్ పుట్టింటినుండి తీసుకొచ్చాడు. ఇంటికొచ్చిన కొంత సమయానికే భార్యతో గొడవపడి ఆమెను గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం తన కుమారుడిని సంపులో పడేసి హతమార్చాడు. కుమార్తె మాత్రం పారిపోయి ప్రాణాలు దక్కించుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకు పరిశీలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడని తెలిపారు. కుటుంబ కలహాలతో ధనరాజ్ హత్య చేసిఉంటాడని ప్రాథమికంగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.