మూడు వన్డేల సిరీస్‌లో భారత్ విజయం..
ముంబయి (CLiC2NEWS): భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్యం తొలి వన్డే మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మూడు వన్డేల సిరీస్‌లో టీమ్ ఇండియా తొలి విజయం తన ఖాతాలోవేసుకుంది. ముంబయి వేదికగా భారత్, ఆసీస్ మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో భారత్ విజయం సొంతం చేసుకుంది. ఆసీస్‌పై 5వికెట్ల తేడాతో విజయంతో శుభారంభం చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 35.4 ఓవర్లలొ 188 పరుగులు చేసి ఆలౌటయింది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా 5 వికెట్లు కోల్పోయి 39.5 ఓవర్లలో పూర్తి చేసి 1-0 ఆధిక్యంలోకి అడుగుపెట్టింది.