వేస‌వి సెల‌వుల‌కు సొంతూళ్ల‌కు వెళ్తున్నారా..

హైద‌రాబాద్ (CLiC2NEWS): బ‌డుల‌కు సెల‌వులు ప్ర‌క‌టించారు. తీర్థ‌యాత్ర‌ల‌కు, విహార యాత్ర‌లు, సొంతూళ్ల‌కు వెళ్ల‌డానికి న‌గ‌ర‌వాసులు ఆస‌క్తి చూపుతారు. ఇదే అదునుగా చేసుకొని తాళాలు వేసిఉన్న ఇళ్ల‌లో దొంగ‌లు చోరీల‌కు పాల్ప‌డుతున్నారు. స‌మ్మ‌ర్ వెకేష‌న్స్‌లో సొంతూళ్ల‌కు, విహార యాత్ర‌ల‌కు వెళ్లే వారు స్థానిక పోలీస్ స్టేష‌న్‌లో స‌మాచారం ఇవ్వాల‌న్నారు. ఇంటికి తాళాలు వేసి ఊరెళ్లే వారు విలువైన వ‌స్తువులు, న‌గ‌దును బ్యాంకు లాక‌ర్ల‌లో భ‌ద్ర‌ప‌రుచుకోవాల‌ని సూచించారు. స‌మ్మ‌ర్‌క్రైమ్‌ల ఎక్కువ‌గా ఆట‌మొబైల్‌, హౌస్‌హోల్డ్ థెఫ్ట్, ప్రాప‌ర్టీ థెప్ట్ వంటి ఆర్ధిక ప‌ర‌మైన నేరాలు ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయ‌ని తెలిపారు. అంతేకాకుండా ఇంటికి తాళం వేసి వెళ్లే వారికి త‌గు సూచ‌న‌లు చేశారు.

ఇంటికి సెక్యూరిటీ అలారం, మోష‌న్ సెన్సార్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ఇంటి మెయిన్ డోర్‌కు సెంట్ర‌ల్ లాక్ సిస్ట‌మ్ ఏర్పాటు చేసుకోవాలి. వాహ‌నాల‌కు లాక్‌లు వేసి.. ఇంటి ఆవ‌ర‌ణ‌లోనే పార్క్ చేయాలి. ఎట్టి ప‌రిస్తితుల‌లో నేపాలి వారిని ఇంట‌ల్లో ప‌నికి పెట్టుకోకూడ‌దు. సిసి కెమెరాలు అమ‌ర్చుకోవాలి. న్యూస్ పేప‌ర్‌, పాల పాకెట్లు ఇంటి ముందు జ‌మ కాకుండా చూసుకోవాలి. వీటివ‌ల్ల ఇంట్లో మ‌నుషులు లేర‌న్న విష‌యం ప‌సిగట్టే అవ‌కాశం ఉంది. ఇంట్లో లేన‌పుడు ఇంటిలోప‌ల, బ‌య‌ట కూడా లైట్లు వేసి ఉంచాలి. మీరు బ‌య‌ట‌కు వెళ్లిన‌పుడు.. ఆవిష‌యాన్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌కూడ‌దు.

Leave A Reply

Your email address will not be published.