నన్ను బెదిరిస్తున్నారు.. నయీమ్‌కే భయపడలేదు..!: ఈటల
హైదరాబాద్ (CLiC2NEWS): బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమేవేశంలో మాట్లాడుతూ.. నన్ను జాగ్రత్తగా ఉండాలని కొన్ని నెలలుగా బెదిరిస్తున్నారన్నారు. నయీమ్‌కే భయపడలేదు. ఈ బెదిరింపులకు భయపడతానా అని పార్టీలు మారడం దుస్తులు మార్చుకున్నంత సులువు కాదు. బిఆర్ ఎస్ నుండి నేను బయటకు రాలేదు.. వారు గెంటేస్తే వచ్చానన్నారు. నాకు నేనుగా పార్టీ మారలేదన్నారు. జాతీయ రాజకీయాలు నాకు కొత్తవి.. నేను వారిని కోరలేదు. బిజెపి అధిష్టానం పిలిస్తేనే ఢిల్లీకి వెళ్లానని.. ఎప్పటికైనా బిఆర్ ఎస్‌ను కొట్టేది భారతీయ జనతా పార్టీయేనని ఈటల అన్నారు.
బిజెపి నేతలతో ఫొటో దిగితే బిసి బందు, దళితబంధు, ప్రభుత్వ పతకాలు అందవని బిఆర్ ఎస్ నేతలు బెదిరిస్తున్నారన్నారు. ఇప్పటికైనా గ్రాప పంచాయితీ సర్పంచులు, ఎంపిటిసిలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలన్నారు.
మరోవైపు ఈటల రాజేందర్‌ను చంపేందుకు కుట్ర జరుగుతుందని ఆయన సతీమణి జమున ఆరోపించారు. రూ. 20 కోట్లు ఇచ్చి ఈటలను చంపిస్తామంటున్నట్లు తెలిసిందని ఆమె వ్యాఖ్యానించారు.