TS: స‌ర్కార్ బడుల‌లో ఇకనుండి బ్రేక్‌పాస్ట్‌..

విద్యార్థుల‌కు ద‌స‌రా కానుక‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ద‌స‌రా నుండి అల్పాహార పథకం ప్రారంభించాల‌ని ముఖ్య‌మంత్రి కెసిఆర్ నిర్ణ‌యించారు. ఈ ప‌థ‌కం కింద ఒక‌టో త‌ర‌గ‌తి నుండి ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు విద్యార్థుల‌కు బ్రేక్‌పాస్ట్ అందించ‌నున్నారు. ద‌స‌రా కానుక‌గా వ‌చ్చే నెల 24వ తేదీ నుండి ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. త‌మిళ‌నాట అమ‌లవుతున్న అల్పాహార ప‌థ‌కాన్ని ఇటీవ‌ల ఉన్న‌తాధికారులు ప‌రిశీలించారు. విద్యార్థుల‌కు బోధ‌న‌తో పాటు మంచి పోష‌కాహారం అందించాల‌ని ఈ ప‌థ‌కం అమ‌లు చేయ‌నున్నారు. పిల్ల‌లు ఈ కొత్త ప‌థ‌కం ద్వారా రాష్ట్ర ఖ‌జానాపై ప్ర‌తి ఏటా రూ. 400 కోట్ల అధ‌న‌పు భారం ప‌ద‌నుంది.

Leave A Reply

Your email address will not be published.