ఏడేళ్ల కిందటి కాల్ లిస్ట్ ఆధారంగా విచారించారు: నవదీప్
హైదరాబాద్ (CLiC2NEWS): టిఎస్ నార్కొటిక్ విభాగం పోలీసులు సినీ నటుడు నవదీప్‌ను విచారించారు. శనివారం బషీరబాగ్లో వివిధ కోణాల్లో ప్రశ్నించారు. డ్రగ్స్ కేసులో నార్కొటిక్ బ్యూరో అధికారులు సినీ నటుడు నవదీప్‌కు నోటీసులు పంపించారు. విచారణ ముగిసిన అనంతరం నవదీప్ మీడియాతో మాట్లాడారు. ఏడేళ్ల క్రితం కాల్ లిస్ట్ ఆధారంగా విచారించారని తెలిపారు. తెలంగాణ నార్కొటిక్ అధికారులకు దేశంలో మంచి రికార్డు ఉందని.. అద్భుతమైన టీమ్‌ను ఏర్పాటు చేశారన్నారు. విశాఖకు చెందిన రామచంద్‌తో పరిచయం ఉందని.. కానీ తాను ఎలాంటి మాదకద్రవ్యాలు అతని వద్ద నుండి కొనగోలు చేయలేదన్నారు. గతంలో సిట్, ఇడి విచారించారని, ఇపడు టిఎస్ నార్కొటిక్ విభాగంవారు విచారించారు. నేను ఎపుడూ ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదని నవదీప్ తెలిపారు. అవసంరం ఉంటే మళ్లీ విచారణకు పిలుస్తారన్నారని తెలిపారు.