మరోసారి గొప్పమనసు చాటుకున్న సోనూసూద్
సినిమావాళ్లు తెరమీద మాత్రమే హీరోలు.. అనేది మనకు తెలిసింది. కానీ సోనూసూద్ రీల్‌లైఫ్‌లో కాదు రియల్ లైఫ్‌లో హీరో అని అల్రెడీ మనకు తెలిసిందే.. అయితో మరోసారి సోనూ మంచి మనసును చాటుకున్నారు. అనారోగ్యం బారిన పడిన బాలుడికి అండగా నిలిచాడు మన రియల్ హీరో. శ్వాసకోశ సమస్య ఉన్న బాలుడికి అనారోగ్యం బారిన పడ్డ బాలుడిని సోమవారం ముంబై ఎస్ఆర్సీసీ ఆస్పత్రిలో చేర్పిస్తానని సోనూసూద్ ట్వీట్ చేశారు. వారం రోజుల లోగా శస్ర్త చికిత్స చేస్తారని ఆయన తెలిపారు. తన కుమారుడి ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ సాయం చేయాలని ఐదు రోజుల క్రితం తల్లి ట్వీట్ పోస్టు చేసింది. తన బిడ్డకు హార్ట్ సర్జరీ చేయాలని వైద్యులు తెలిపారని, సాయం చేయాలని ట్విట్టర్లో వేడుకుంది. ఆ ట్వీట్ చూసి సోనూసూద్ సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.