తోటి విద్యార్థుల ముందు అధ్యాపకుడు మందలించాడని..
భవనం మీద నుండి దూకి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ (CLiC2NEWS): ఘట్కేసర్లో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి భవనం మీద నుండి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఘట్కేసర్ మండలం వెంకటాపూర్‌లోని అనురాగ్ విశ్వవిద్యాలయంలో నక్కిరెడ్డి జ్ఞానేశ్వర్ రెడ్డి సిఎస్ ఇ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. కొన్ని రోజులుగా తరగతులకు ఆలస్యంగా రావడం.. ఇటీవల జరిగిన సెమిస్టర్ ఫలితాల్లో అన్ని సబ్జెక్టులు ఫెయిలవ్వడంతో అధ్యాపకుడు (డీన్) విస్రావ్ విద్యార్థికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఈ క్రమంలో కటింగ్ చేయించుకోవాలని సూచించారు. బుధవారం కూడా ఇదే విషయం చెప్పారు. తోటి విద్యార్థుల ముందు మందలించాడని అవమానంగా భావించి జ్ఞానేశ్వర్ వర్సిటిభవనం రెండో అంతస్తు నుండి దూకాడు. వెంటనే గమనించిన అధ్యాపకులు ఆసుపత్రికి తరలించారు. అధ్యాపకుడు అవమానించడం వలనే ఆత్మహత్యకు ప్రయత్నించాడని జ్ఞానేశ్వర్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.