ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేలు..!
హైదరాబాద్ (CLiC2NEWS): ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కారణంగా అనేక మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా బిఆర్ ఎస్ ఎమ్మెల్యేలు పలు ప్రశ్నలు లేవనెత్తారు. మంత్రి శ్రీధర్‌బాబు సమాధానమిస్తూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు కట్టుబడిఉన్నామని.. ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ. 12వేలు అందజేస్తామని హామీ ఇచ్చామన్నారు. ఈ మాటకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. వచ్చే బడ్జెట్‌లో దీనని ఖచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.