ఎస్బిఐలో 80 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు
ముంబయిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో 80 స్పెషలిస్ట్ కేడర్ ఆపీసర్ పోస్టులు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. రెగ్యులర్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి ఆన్లైన్లో మార్చి 4వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు బిఇ బిటెక్ ఎంఇ ఎంటెక్ ఎంసిఎ ఎమ్మెస్సి అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయస్సు అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు 30 ఏళ్లు, డిప్యూటి మేనేజర్‌కు 35 ఏళ్లు, మేనేజర్‌కు 38 ఏళ్లు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌కు 42 ఏళ్లలోపు ఉండాలి. దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.