అన్ని రంగాల్లో ముస్లిం మైనారిటీల‌కు స‌ముచిత స్థానం: సిఎం రేవంత్‌రెడ్డి

హైద‌రాబాద్ (CLiC2NEWS): న‌గ‌రంలోని  ఎల్బిస్టేడియంలో నిర్వ‌హించిన ఇఫ్తార్ విందులో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సిఎం ముస్లిం సోద‌రుల‌కు రంజాన్ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ముస్లిం, క్రిస్టియ‌న్‌ మైనారిటీలకు అన్ని రంగాల్లో స‌ముచిత స్థానం క‌ల్పిస్తామ‌ని తెల‌పారు. మైనారిటీ పాఠ‌శాల భ‌వ‌నాల కోసం ప్ర‌భుత్వం ఇప్ప‌టికే నిధులు విడుద‌ల చేసింద‌ని, ముస్లింల‌కు రిజ‌ర్వేష‌న్లు అమ‌లు జ‌రిగేల చూసే బాధ్య‌త త‌మ‌దేన‌ని.. సిఎం తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో డిప్యూటి సిఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపి అస‌దుద్దిన్‌, ష‌బ్బీర్ అలీ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.