ఎక‌రాకు రూ. 10-15 వేల న‌ష్ట‌ప‌రిహారం.. మంత్రి జూప‌ల్లి

భిక్క‌నూరు (CLiC2NEWS): ఇటీవ‌ల కురిసిన వ‌ర్షాల‌కు రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో పంట న‌ష్టం వాటిల్లింది. వ‌డ‌గండ్ల వర్షానికి కొన్ని చోట్ల పంట‌ పొలాలు పూర్తిగా దెబ్బ‌తిన్నాయి. గురువారం కామారెడ్డి జిల్లాలో మంత్రి జూప‌ల్లి ప‌లు గ్రామాలలోని పంట పొలాల‌ను ప‌రిశీలించారు. రైతుల‌ను ఆధైర్య‌ప‌డొద్ద‌ని.. ఆదుకుంటామ‌న్నారు. పంట న‌ష్టానికి ఎక‌రానికి రూ. 10 వేల నుండి 15 వేల వ‌ర‌కు ప‌రిహారం ఇచ్చేందుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంద‌ని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.