సీనియ‌ర్ హాస్య‌న‌టుడు విశ్వేశ్వ‌ర‌రావు క‌న్నుమూత‌

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): బాల‌న‌టుడుగా కెరీర్‌ను ప్రారంభించి.. 150 కు పైగా తెలుగు, త‌మిళ చిత్రాల‌లో హాస్యం పండించిన విశ్వేశ్వ‌ర‌రావు తుదిశ్వాస విడిచారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న మంగ‌ళ‌వారం క‌న్నుమూశారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని ప‌లువురు సినీ ప్ర‌ముఖ‌లు సంతాపం వ్య‌క్తం చేశారు. ఎన్‌టిఆర్‌, ఎంజిఆర్ ద‌గ్గ‌ర‌నుండి చిరంజీవి, బాల‌కృష్ణ‌, ర‌జ‌నీకాంత్‌, నాగార్జున న‌టించిన చిత్రాల‌లో హాస్యాన్ని పండించారు. విస్సు టాకీసు పేరుతో ఓ యూట్యూబ్ ఛాన‌ల్ నిర్వ‌హిస్తున్నారు. దానిలో ఆయ‌న త‌న అన‌భ‌వాల‌ను పంచుకునేవారు.

Leave A Reply

Your email address will not be published.