8 విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకున్న ‘విక్ర‌మ్‌’

ఒసాకా త‌మిళ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్..

Osaka Tamil International Film Festival:  2022లో విడుద‌లైన చిత్రాల‌లో విక్ర‌మ్ చిత్రం మొత్తం 8 విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకుంది. జ‌పాన్ దేశంలోని ఒసాకా న‌గ‌రం ఈ అవార్డుల వేడుకుకు వేదికైంది. ఉత్త‌మ‌ చిత్రంగా.. క‌మ‌ల్ హాస‌న‌న్ ఉత్త‌మ న‌టుడిగా నిలిచారు. ఉత్త‌మ న‌టిగా సాని కాయితం సినిమాకు గాను కిర్తి సురేష్ ద‌క్కించుకుంది. ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా మ‌ణిర‌త్నం (పోన్నియ‌న్ సెల్వ‌న్ 1 చిత్రం), ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడిగా అనిరుద్ (విక్ర‌మ్ )
నిలిచారు. ఉత్త‌మ కొరియోగ్రాఫ‌ర్‌గా జానీ మాస్ట‌ర్ (బీస్ట్‌) , బెస్ట్ విల‌న్‌గా విజ‌య్ సేతుప‌తి (విక్ర‌మ్‌), బెస్ట్ స‌పోర్టింగ్ యాక్ట‌ర్ ఫ‌హాద్ ఫాజిల్ (విక్ర‌మ్‌) , బెస్ట్ స‌పోర్టింగ్ యాక్ట్రెస్‌గా ఐశ్వ‌ర్యా రాయ్ (పొన్నియ‌న్ సెల్వ‌న్ -1) నిలిచారు.

Leave A Reply

Your email address will not be published.