తిరుమ‌ల ఘాట్  రోడ్‌లో ప్ర‌మాదానికి గురైన జీపు.. 

తిరుమ‌ల (CLiC2NEWS): తిరుమ‌లకు భ‌క్తుల‌తో వెళుతున్న జీపు  ఘాట్ రోడ్‌లో బోల్తాప‌డింది. ఈ ప్ర‌మాదంలో జీపులో ప్ర‌యాణిస్తున్న ప‌లువురు భ‌క్తుల‌కు గాయాల‌య్యాయి.  శుక్ర‌వారం తిరుప‌తి నుండి బ‌య‌లుదేరిన జీపు రెండో ఘాట్ రోడ్లో ఏడో కిలోమీట‌రు వ‌ద్ద అదుపు తప్పి బోల్తాపడింది. జీపులో ఉన్న ప్ర‌యాణికులు స్వ‌ల్ప‌గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు.  ఘ‌ట్ రోడ్ భ‌ద్ర‌తా సిబ్బంది వెంట‌నే స్పందించి జీపును ప‌క్క‌కు తొల‌గించారు. క్ష‌త‌గాత్రులను ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్సనందించారు.

Leave A Reply

Your email address will not be published.