మందమర్రిలో జ‌నావాసాల్లోకి కొండచిలువ

మంచిర్యాల: జిల్లాలోని కోల్‌బెల్ట్ ప్రాంత‌మైన‌ మందమర్రిలో వెంకటేశ్వరస్వామి గుడి వద్ద కొండచిలువ హల్ చల్ చేసింది. పరిసర అడవుల్లో నుంచి జనావాసాల్లోకి రావ‌డంతో స్థానికులు ఒక్క‌సారిగా తీవ్ర భయాందోళనల‌కు గురయ్యారు. స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందివ్వ‌డంతో వారు కొండ‌చిలువ‌ను పట్టుకుని అడవిలో వదిలేశారు. కొండ చిలువతో పాటు మరో రెండు పాములను కూడా గుర్తించి అడవిలోకి వదిలేశారు.

Leave A Reply

Your email address will not be published.