తెలుగులో ప్రమాణం చేసిన తమిళనాడు ఎంపి..
ఢిల్లీ (CLiC2NEWS): లోక్సభలో ఎంపీల ప్రమాణస్వీకారాలు మంగళవారం కూడా కొనసాగాయి. ప్రధానమంత్రి సహా సోమవారం 262 మంది ఎంపిలు ప్రమాణం చేయగా.. కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ సహా మిగిలిన ఎంపిలు ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. ఈ క్రమంలో తమిళనాడు నుండి గెలుపొందిన కృష్ణగిరి ఎంపి కె.గోపినాథ్ తెలుగులో ప్రమాణం చేసి అందిరి దృష్టిని ఆకర్షించారు. చివరిలో జై తమిళనాడు అని నినాదం చేశారు. గతంలో కూడా గోపినాథ్ తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికైన సమయంలో కూడా యాన తెలుగులోనే ప్రమాణం చేశారు. అంతేకాకా అసెంబ్లీలో తెలుగులోనే మాట్లాడేవారు. అప్పటి ముఖ్యమంత్రి జయలలిత తెలుగులోనే సమాధానమిచ్చేవారు. లోక్సభ స్పీకర్ ఎన్నిక బుధవారం జరగనుంది.