AP: సినిమాల్లో నటించడంపై స్పందించిన డిప్యూటి సిఎం పవన్‌కల్యాణ్
పిఠాపురం (CLiC2NEWS): మూడు నెలల పాటు షూటింగ్‌కు దూరంగా ఉంటానని డిప్యూటి సిఎం, జనసేనాని పవన్‌కల్యాణ్ తెలిపారు. పిఠాపురంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన వారాహి సభలో ఆయన పాల్గొన్నారు. సినిమాలపై స్పందించాలని అభిమానులు కోరగా.. “సినిమాలు చేసే టైమ్ ఉంటుందంటారా ? అంటూ.. కనీసం రోడ్డు గుంతలు కూడా పూడ్చలేదని మీరు నన్ను తిట్టకుండా ఉండాలి కదా. అందుకే ముందు చెప్పిన పనిచేయాలన్నారు. లేకపోతే నిన్ను ఎన్నకుంటే నువ్వెళ్లి ఒజి చేస్తావా? క్యాజి..” అంటే నేనేం సమాధానం చెప్పాలన్నారు.
వీలున్నపుడు ఒకట్రెండు రోజులు షూటింగ్‌కు కేటాయిస్తానని, ఈ విషయంలో క్షమించమని నిర్మాతలను కోరినట్లు తెలిపారు. ఎపి ప్రజలకు సేవ చేసుకుంటూ వీలున్నపుడు నటిస్తానన్నారు. ఈ సందర్బంగా ఒజి బాగుంటుందని జనసేనాని అభిమానులలో ఆసక్తి రేకిత్తించారు. సినిమాల్లో త్వరలో నటిస్తానని చెప్పడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.