ఐసిసి ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా హార్దిక్ పాండ్య
Hardik Pandya: టి 20 ప్రపంచ కప్ సాధించడంలో ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్య కీలక పాత్ర పోషించాడనటంలో అతిశయోక్తి లేదు. అటు బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ అదరగొట్టి ఐసిసి ర్యాంకింగ్లో నంబర్ వన్‌గా నిలిచాడు. దీంతో టి20 ల్లో ఆల్‌రౌండర్ల కేటగిరిలో నంబర్ వన్‌గా నిలిచిన తొలి భారతీయుడుగా హార్ధిక్ రికార్డు సృష్టించాడు. శ్రీలంక ఆటగాడు వానిందు హసరంగ (222 పాయింట్లు)తో సమానంగా హార్ధిక్ అగ్రస్థానాన్ని పంచుకున్నాడు. పాండ్య 2024 టి20లో ఆరు ఇన్నింగ్స్ లలో 151.57 స్ట్రైక్ రేట్‌తో 144 పరుగులు చేశాడు. ఇందులో అక హాఫ్ సెంచరీ కూడా ఉంది. 8 మ్యాచ్‌లలో 7.64 ఎకానమీ రేటుతో 11 వికెట్లు తీశాడు. ఇక బుమ్రా ఏకంగా 12 స్థానాలు మెరుగై 12వ స్థానంలో నిలిచాడు. హర్షదీప్ సింగ్ 17 వికెట్లు పడగొట్టి నాలుగు స్థానాలు మెరుగై 13వ స్థానంలో ఉన్నాడు.