కేంద్ర బలగాల నియామకాల్లో అగ్నివీర్లకు 10% రిజర్వేషన్..
ఢిల్లీ (CLiC2NEWS): కేంద్ర బలగాల నియామకాల్లో మాజీ అగ్నివీర్లకు 10శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్లు సిఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియాల్ సెక్యూరిటి ఫోర్స్) , బిఎస్ఎఫ్ నిర్ణయం తీసుకున్నాయి. భవిష్యత్తులో కానిస్టేబుల్ నియామకాల్లో ఈ రిజర్వేషన్ వర్తించనుంది. గతంలో కేంద్ర హోంశాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా నియామకాలు చేపట్టనున్నట్లు సమాచారం. కేంద్ర హోంశాఖ నిర్ణయం ప్రకారం భవిష్యత్తులో చేపట్టబోయే కానిస్టేబుల్ నియామకాల్లో మాజి అగ్నివీరులను నియమించేందుకు సిద్దమవుతున్నట్లు సిఐఎస్ ఎఫ్ డైరెక్టర్ జనరల్ నైనా సింగ్ పేర్కొన్నారు. వీరికి శారీరక సామర్ధ్య పరీక్షల్లోననూ మినహాయింపు వర్తిస్తుంది. మొదటి ఏడాది ఐదు సంవత్సరాలు, తదనంతరం మూడు సంవత్సరాల సడలింపు ఇవ్వనున్నట్లు సమాచారం.