సైబర్ నేరగాళ్ల నయా రూట్.. కలెక్టర్ పేరుతో నగదు వసూళ్లు..
పార్వతీపురం (CLiC2NEWS): సైబర్ నేరగాళ్లు ఏదో ఓ రకంగా ప్రజల నుండి నగదును వసూళ్లకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా పార్వతీపురం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పేరుతో నగదు వసూళ్లు చేశారు. కలెక్టర్ పేరు , ఫోటో పెట్టి వాట్స్ ఖాతా క్రియేట్ చేశారు. అనంతరం కలెక్టర్ మీటింగ్‌లో ఉన్నా.. అత్యవసరంగా డబ్బులు కావాలని కొందరికి మెసేజ్‌లు వెళ్లాయి. అది నమ్మి కొందరు డబ్బు పంపించారు. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరెవరూ డబ్బులు పంపవద్దని వాట్సాప్ గ్రూప్‌లలో సమాచారం ఉంచారు. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.