నదిలో పడిన రెండు బస్సులు.. 65 మంది గల్లంతు..
ఖాట్మండు (CLiC2NEWS): నేపాల్లో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. కొండ చరియలు విరిగి బస్సులపై పడటంతో రెండు బస్సులు త్రిశూన్ నదిలో పడిపోయాయి. రెండు బస్సుల్లో ప్రయాణికులు గల్లంతయ్యారు. నారాయణఘాట్-ముగ్లింగ్ జాతీయ రహదారిపై కొండ చరియలు విరిగి రెండు బస్సులపై పడ్డాయి. ఆ సమయంలో భారీ వర్షం కురుస్తూ ఉంది. 24 మంది ప్రయాణికులతో ఒక బస్సు .. మరో బస్సులో 41 మంది ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ విచారం వ్యక్తం చేశారు. దేశ సాయుధ దళాలు సహాయక చర్యలు చేపట్టాయి.