మనిషి కడుపులో సొరకాయ..!
ఛతర్‌పుర్ (CLiC2NEWS): ఓ యువకుడి కడుపులో ఉన్న సొరకాయను వైద్యులు విజయవంతంగా బయటకు తీశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఖజరహో ప్రాంతంలో చోటుచేసుకుంది. ఓ యువకుడు తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లాడు. అతడికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు కడుపులో ఏదో ఉందని ఎక్స్‌రే ద్వారా గుర్తించారు. శనివారం అతడికి శస్త్ర చికిత్స నిర్వహించగా.. పొట్టలో తొడిమతో సహా ఉన్న సొరకాయను చూసి ఆశ్చర్యపోవడం వైద్యులవంతైంది. ఈ సొరకాయ కారణంగా యువకుడి పెద్దపేగు నలిగిపోయింది. అయితే అతడి శరీరంలోకి ఇది ఎలా వచ్చిందన్న విషయం ఇంకా తెలియలేదు. అతనికి సృహ వచ్చిన అనంతరం తెలుస్తుందని వైద్యులు భావిస్తున్నారు.