ఎఆర్‌సిఐ, హైద‌రాబాద్ లో 15 టెక్నిక‌ల్ పోస్టులు

ARCI:  ఇంట‌ర్నేష‌నల్ అడ్వాన్స్‌డ్ రిసెర్చ్ సెంట‌ర్ ఫ‌ర్ పౌడ‌ర్ మెట‌ల‌ర్జి అండ్ మెటీరియ‌ల్స్

 

హైద‌రాబాద్, బాలాపూర్ లో ఉన్న ఎఆర్‌సిఐ లో 15 టెక్నిక‌ల్ పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు.  వెల్డ‌ర్‌, ట‌ర్న‌ర్‌, ఎల‌క్ట్రీషియ‌న్ , సివిల్‌, మెకానిక‌ల్‌, మెట‌ల‌ర్జి , హెచ్ ఆర్‌, ఫైనాన్స్‌, స్టోర్స్‌, సెక్ర‌టేరియ‌ల్ వ‌ర్క్స్‌, కెమిస్ట్రీ  సంబంధిత విభాగాల్లో  అసిస్టెంట్ పోస్టులు 5, టెక్నిక‌ల్ అసిస్టెంట్ 7 , టెక్నీషియ‌న్ 3 పోస్టులు క‌ల‌వు. అభ్య‌ర్థులు ప‌దో త‌ర‌గతి, సంబంధిత విభాగంలో ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, బిఎస్‌సితో పాటు ప‌ని అనుభ‌వం ఉన్న అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

అభ్య‌ర్థులు  ఆగ‌స్టు 26 లోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాత ప‌రీక్ష , స్కిల్ టెస్ట్‌ల ద్వారా అభ్య‌ర్థుల ఎంపిక జ‌రుగుతుంది. రాత ప‌రీక్ష‌ను సెప్టెంబ‌ర్ 22న హైద‌రాబాద్‌లో నిర్వ‌హించనున్నారు. అసిస్టెంట్ పోస్టుల‌కు రూ. 57,960, టెక్నిక‌ల్ అసిస్టెంట్ పోస్టుల‌కు రూ. 69,120, టెక్నీషియ‌న్ పోస్టుల‌కు రూ. 51,300 వేత‌నం చెల్లిస్తారు. ద‌ర‌ఖాస్తు రుసుం జ‌న‌ర‌ల్ / ఒబిసి అభ్య‌ర్థులకు రూ. 500.. ఎస్ సి / ఎస్‌టి/  పిడబ్ల్యూ డి / మ‌హిళ‌ల‌కు రూ. 300గా నిర్ణ‌యించారు. పూర్తి స‌మాచారం కొర‌కు https://www.arci.res.in/careers/  వెబ్‌సైట్ చూడ‌గ‌ల‌రు.

 

Leave A Reply

Your email address will not be published.