న్యాయ‌వాదుల‌పై పోలీసుల దాడిని ఖండిస్తూ DRT లాయ‌ర్ల నిర‌స‌న‌

హైద‌రాబాద్ (CLiC2NEWS):న్యాయ‌వాదుల‌పై పోలీసుల దాడుల‌ను ఖండిస్తూ DRT (డెబిట్స్ రిక‌వ‌రీ ట్రిబ్యున‌ల్‌) వ‌ద్ద న్యాయ‌వాదులు బుధ‌వారం నిర‌స‌న తెలిపారు. కేసు విష‌యంలో మాట్లాడేందుకు పోలీస్ స్టేష‌న్ కు వెళ్లిన ఇద్ద‌రు న్యాయ‌వాదుల‌పై పోలీసులు దురుసుగా ప్ర‌వ‌ర్తించి దాడి చేశార‌ని జ‌న‌గామ బార్ అసోసియేష‌న్ ఆరోపించిన విష‌యం తెలిసిందే. ఈ మేర‌కు జ‌న‌గామ బార్ అసోసియేష‌న్ కోర్టు విధుల బ‌హిష్క‌ర‌ణ‌, నిర‌స‌న‌ల‌కు పిలుపునిచ్చింది.

జ‌న‌గామ‌లో లాయ‌ర్ల‌పై దాడిని ఖండిస్తూ హైద‌రాబాద్‌లోని DRT (డెబిట్స్ రిక‌వ‌రీ ట్రిబ్యున‌ల్‌) బార్ అసోసియేష‌న్ న్యాయ‌వాదులు నిర‌స‌న తెలిపారు.. ఈ సంద‌ర్భంగా DRT బార్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ జికె దేశ్‌పాండే, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ డి. రాఘ‌వులు స‌హా ప‌లువురు లాయ‌ర్లు నిర‌స‌న బ్యాడ్జీలు ధ‌రించి తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప‌లు కేసుల్లో వాదిస్తున్న న్యాయ‌వాదుల పై దాడుల ప‌ట్ల తీవ్రం అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఈ దాడులు న్యాయ‌వాదుల హ‌క్కుల‌ను కాల‌రాసేవిధంగా ఉన్నాయ‌ని లాయ‌ర్లు పేర్కొన్నారు. న్యాయ‌వాదుల‌కు ప్ర‌భుత్వాలు త‌గిన భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని డిమాండ్ చేశారు.

ఆందోళ‌న అనంత‌రం మీడియాతో మాట్లాడుతున్న DRT బార్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ జికె దేశ్‌పాండే చిత్రంలో జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ డి. రాఘ‌వులు, జాయింట్ సెక్రెట‌రి కె. క‌ల్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి, ట్రెజ‌ర‌ర్‌ అదిర‌న్ కిర‌ణ్ రాజ్ త‌దిత‌ర న్యాయ‌వాదులు

ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మంలో DRT బార్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ జికె దేశ్‌పాండే,  జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ డి. రాఘ‌వులు, జాయింట్ సెక్రెట‌రి కె. క‌ల్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి, ట్రెజ‌ర‌ర్‌ అదిర‌న్ కిర‌ణ్ రాజ్‌, స్పోర్ట్స్ అండ్ క‌ల్చ‌ర‌ల్ సెక్రెట‌రీ సిహెచ్ కిషోర్‌,  ఎగ్జిక్యూటీవ్ మెంబ‌ర్స్‌ ఎ. న‌రేష్‌,  శ్ర‌వ‌ణ్ కుమార్ రాగి,  పి రాజేశ్వ‌రి, ప‌లువురు సీనియ‌ర్‌, జూనియ‌ర్ లాయ‌ర్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.