గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్‌ఖాన్
హైదరాబాద్ (CLiC2NEWS) : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా తెలంగాణ జన సమితి పార్టి అధ్యక్షడు కోదండరామ్, అమీర్‌ఖాన్ ప్రమాణం చేశారు. వీరితో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణం చేయించారు. తాను ఎమ్మెల్సీ కావడంతో ఉద్యమ కారులు సంతోషంగా ఉన్నారని కోదండరామ్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ అవకాశం ఇచ్చిన సిఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యమ కారులు, అమర వీరుల ఆకాంక్షల మేరకు పనిచేస్తానని అన్నారు. అనేకమంది బలిదానాలు చేయడం వలనే తాము ఈ స్థానంలో ఉన్నట్లు పేర్కొన్నారు.