స్వదేశంలో వినేశ్‌కు ఘన స్వాగతం
ఢిల్లీ (CLiC2NEWS): భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు స్వదేశంలో అపూర్వ స్వాగతం లభించింది. పారిస్ ఒలింపిక్స్‌లో 100 గ్రాముల బరువు తేడాతో ఆమె ఫైనల్ పోటీ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో భారత్‌కు పతకం చేజారింది. ఈ బాధలో ఉన్న ఫొగాట్.. స్వదేశంలో ఆమెకు ఘన స్వాగతం లభించింది. అభిమానుల ప్రేమకు ఆమె భావోద్వేగానికి గురయ్యారు. శనివారం వినేశ్ ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు అభిమానులు పెద్దెత్తున స్వాగతం పలికారు.
అనంతరం వినేశ్ మాట్లాడుతూ.. కష్టసమయంలో అండగా నలిచిన అందరికీ కృతజ్ఞతలు. గోల్డ్‌మెడల్ రాలేదు.. కానీ ఇక్కడి ప్రజలిచ్చారన్నారు. మీ ప్రేమాభిమానాలు ఒలింపిక్ పతకాల కంటే విలువైనవని, ఇవి వెయ్యి బంగారు పతకాల కంటే ఎక్కువ అని పేర్కొంది.