AP: రాష్ట్రంలో సిబిఐ విచార‌ణ ప‌రిధిని కొన‌సాగిస్తూ గెజిట్ నోటిఫికేష‌న్‌..

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్రంలో సిబిఐ విచార‌ణ‌కు సాధార‌ణ స‌మ్మ‌తి ఇస్తూ గెజిట్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఢిల్లీ స్పెష‌ల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ చ‌ట్టం 1946 లోని సెక్ష‌న్ 3 ప్ర‌కారం సిబిఐ విచార‌ణ పరిధి పెంచుతూ ప్ర‌భుత్వం ఆదేశాలిచ్చింది. సిబిఐ ప‌రిధిలో నిర్దేశించిన నేరాల విచార‌ణ కోసం ప్ర‌భుత్వం సాధార‌ణ అనుమ‌తినిచ్చింది. కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు, ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల్లో అవినీతికి పాల్ప‌డిన ఉద్యోగుల‌పై నేరుగా విచార‌ణ చేసేందుకు.. రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల విష‌యంలో ప్ర‌భుత్వ అనుమ‌తితోనే విచార‌ణ చేప‌ట్టేలా అనుమ‌తినిస్తూ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

Leave A Reply

Your email address will not be published.