హైదరాబాద్‌లోని డిఆర్‌డిఒలో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు
DRDO: నగరంలోని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఒ)కు చెందిన సెంటర్ ఫర్ హైఎనర్జి సిస్టమ్స్ అండ్ సైన్సెస్ (చెస్)లో 8 జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు భర్తీ చేయనున్నారు. మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, లేజర్ టెక్నాలజి, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రమెంటేషన్, కెమిస్ట్రీ తదితర విభాగాల్లో .. రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు- 2, జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు 6 ఉన్నాయి.
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో బిఇ/ బిటెక్, పిజి, పిహెచ్‌డితో పాటు పని అనుభవం ఉండాలి. నెట్ / గేట్ స్కోర్ తప్పనిసరి.
వయస్సు: అభ్యర్థుల వయస్సు రిసెర్చ్ అసోసియేట్ పోస్టుకు 35 ఏళ్లు, జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుకు 28 ఏళ్లు మించకూడదు.
స్టైపెండ్: రిసెర్చ్ అసోసియేట్ పోస్టుకు నెలకు స్టైపెండ్ రూ. 67,000 అందుతుంది. జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుకు నెలకు రూ. 37, 000.
ఎంపిక: విద్యార్హత, షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ , పని అనుభవం ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తులకు చివరి తేదీ 29-09-2024. ఇ-మెయిల్ ద్వారా దరఖాస్తులు పంపించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు https://www.drdo.gov.in/వెబ్సైట్ చూడగలరు.