ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక.. డిఎ పెంపు
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్తనందించింది. దీపావళి పండుగ సందర్బంగా ప్రభుత్వ ఉద్యోగులకు 3.64% డిఎ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ డిఎ పెంపు 2022 జులై ఒకటో తేదీ నుండి వర్తిస్తుందని వెల్లడించారు. నవంబరు జీతంతో కలిపి పెరిగిన డిఎ చెల్లింపులు చేయనున్నారు. 2022 జులై ఒకటి నుండి 2024 అక్టోబర్ 31 వరకు డిఎ బకాయిలు జిపిఎఫ్ ఖాతాలో జమ చేయనున్నారు. 2025 మార్చి 31వ తేదీ లోపు పదవీ విరమణ చేసే ఉద్యోగులకు డిఎ బకాయిలు 17 సమాన వాయిదాల్లో చెల్లింపులు చేయనున్నట్లు సమాచారం.