అక్కినేని వారి ఇంట మోగనున్న పెళ్లి బాజాలు
హైదరాబాద్ (CLiC2NEWS): నాగచైతన్య, శోభితల వివాహానికి ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 4వ తేదీన అక్కినేని వారి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈ మేరకు కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం ఆగస్టు 8వ తేదీన జరిగిన విషయం తెలిసిందే. కానీ వీరి పెళ్లి తేదీపై ఎటువంటి ప్రకటనా చేయలేదు. తాజాగా వివాహ తేదీ ని ఖరారు చేశారు.