అంగుళం భూమిపై కూడా రాజీపడబోం: ప్రధాని మోడీ
కచ్ (CLiC2NEWS): సరిహద్దుల్లో ఒక్క అంగుళం భూమి విషయంలోనూ భారత్ రాజీ పడబోదని ప్రధాన మంత్రినరేంద్ర మోడీ స్పష్టం చేశారు. దీపావళి పర్వదినం సందర్భంగా గుజరాత్లోని కచ్ ప్రాంతంలో సైనికులతో కలిసి ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైనికులకు ప్రధాని మిఠాయిలు తినిపించారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. దేశాన్ని రక్షించే సైనికులపై ప్రజలు విశ్వాసంలో ఉన్నారని అన్నారు. భారత్ తన శత్రువుల మాటలను కాదు.. సైనికుల దృఢ నిశ్చయాన్ని విశ్వసిస్తుందన్నారు. భారత దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అడుగులు వేస్తున్నామని ప్రధాని అన్నారు. భారత్ కలలకు సైనికులే రక్షకులు అని అన్నారు. త్రివిధ దళాలు ఒక్కచోట చేరితే మన శక్తిసామర్థ్యాలు ఎంతో పెరుగుతాయన్నారు.