ఆగ్రా స‌మీపంలో కుప్ప‌కూలిన మిగ్ -29 విమానం

ఆగ్రా (CLiC2NEWS): పంజాబ్‌లోని అదంపూర్ నుండి బ‌య‌లుదేరిన ఫైట‌ర్ జెట్ యుద్ద విమానం ఆగ్రా స‌మీపంలో కుప్ప‌కూలింది. ఈ ఘ‌ట‌న‌లో పైల‌ట్ ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. విన్యాసాల కోసం మిగ్-29 యుద్ధ విమానం ఆగ్రా వెళ్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. గ‌తంలో కూడా మిగ్ -29  విమానం కుప్ప‌కూలింది. సెప్టంబ‌ర్ 2న రాజ‌స్థాన్‌లో మిగ్‌-29 ఫైట‌ర్ జెట్ కుప్ప‌క‌లింది. ప్ర‌మాదాన్ని ముందే గ్ర‌హించిన పైల‌ట్ ఆ విమానం నుండి సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డాడు.

Leave A Reply

Your email address will not be published.