కేంద్ర మంత్రి అమిత్‌షాతో ఎపి డిప్యూటి సిఎం భేటీ
ఢిల్లీ (CLiC2NEWS): ఢిల్లీ పర్యటనలో ఉన్న ఎపి డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ కేంద్ర మంత్రి అమిత్‌షాతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి డిప్యూటి సిఎం పవన్‌కల్యాణ్ అమిత్‌షాతో భేటీ అయ్యారు. సహకార శాఖ నుండి నిధుల కేటాయింపుపై అమిత్‌షాతో పవన్ చర్చించినట్లు సమాచారం. అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశం విషయం చర్చించినట్లు తెలుస్తోంది.