తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో 64 పోస్టులు
తెలంగాణ వైద్య విధాన పరిషత్ .. 64 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. 45 ఏళ్ల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరితేదీ ఈ నెల 26గా నిర్ణయించారు. దరఖాస్తులను ఆఫ్లైన్లో పంపిచాల్సి ఉంది. ప్రోగ్రామ్ ఆఫీసర్ (హెచ్ ఎస్ అండ్ ఐ ), ఖైరతాబాద్, హైదరాబాద్ చిరునామాకు పంపించాలి. విభాగాల వారీగా పోస్టులు..
ఒబి/ జివై- 17
అనస్థీషియా -11
రేడియాలజి – 8
జనరల్ మెడిసిన్ -10
పిడియాట్రిక్స్ 12
ఆర్దోపెడిక్స్ -2
జనరల్ సర్జరీ -4
అర్హత .. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, పిజి / డిఎన్బితో పాటు పని అనుభవం ఉండాలి. విద్యార్హతల్లో వచ్చిన మార్కులు ఆధారంగా ఎంపిక నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు వేతనం రూ.లక్ష అందుతుంది. పూర్తి వివరాలకు అభ్యర్థులు https://hyderabad.telangana.gov.in/ వెబ్సైట్ చూడగలరు.