22 జిల్లాల్లో ఇందిరా మ‌హిళా భ‌వ‌న్‌లు: మంత్రి సీత‌క్క

హ‌నుమ‌కొండ (CLiC2NEWS): కోటి మంది మ‌హిళ‌ల‌ను కోటీశ్వ‌రుల‌ను చేయ‌డ‌మే సిఎం రేవంత్ రెడ్డి ల‌క్ష్య‌మ‌ని రాష్ట్ర మంత్రులు సీత‌క్క‌, కొండా సురేఖ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో త‌మ ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఏడాది పూర్త‌యిన సంద‌ర్బంగా హ‌నుమ‌కొండ‌లో సోమ‌వారం విజ‌యోత్స‌వ స‌భ నిర్వ‌హించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ స‌భా వేదిక‌కు ఇందిరా మ‌హిళా శ‌క్తి ప్రాంగ‌ణంగా పేరుపెట్ట‌ర‌న్నారు. ఈ సంద‌ర్బంగా సీత‌క్క మీడియాతో మాట్లాడుతూ.. 22 జిల్లాల్లో ఇందిరా మ‌హిళా భ‌వ‌న్లు ఏర్పాటు చేయ‌బోతున్న‌ట్లు తెలిపారు. మంత్రి కొండాసురేఖ మాట్లాడుతూ .. హైద‌రాబాద్ త‌ర్వాత వ‌రంగ‌ల్ ను అభివృద్ధి చేస్తామ‌ని సిఎం చెప్పార‌న్నారు. వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యం ఏర్పాటుపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపిస్తున్న‌ట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.