ఖమ్మంలో విషాదం.. ఛాతీ నొప్పితో నాలుగేళ్ల చిన్నారి మృతి
ఖమ్మం (CLiC2NEWS): అమ్మ ఇంటికి రాగానే.. తల్లిని చూసిన ఆనందంలో చిన్నారి అమ్మా అంటూ పరుగుతీసి, ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తల్లి ఏమైందని ప్రశ్నించగా ఛాతీ వద్ద నొప్పి వస్తోందని చెప్పి అపస్మారక స్థితిలో అపస్మారక స్థితిలో ఉండిపోయింది. వెంటనే హుటాహుటిన స్థానిక ఆర్ ఎంపి వద్ద ప్రాథమిక చికిత్స చేయించి .. ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్ఉల వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా ఎంవిపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. లావణ్య , వినోద్‌ల ఏకైక కూతురు ప్రహర్షిక. అమ్మ గ్రూప్ -3 పరీక్ష రాసేందుకు వెళ్లగా.. నానమ్మ, తాతయ్యల వద్ద ఉంది. అమ్మ ఇంటిరాగానే చూసిన ప్రహర్షిక ఒక్కసారిగా పరుగెత్తుతూ కిందపడిపోయి ప్రాణాలు కోల్పోయింది. ఆ చిన్నారి గుండెపోటుతో మృతి చెందిఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. ఎపుడూ సంతోషంగా , చెలాకీగా ఉండే చిన్నారి విగజీవిగా మారడంతో ఆ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.