అస్సాంలోని క‌రీంగంజ్ జిల్లాకు విశ్వ‌క‌వి పేరు..

గువ‌హ‌టి (CLiC2NEWS): అస్సాంలోని ఓ జిల్లా పేరు మారుస్తూ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకంది. రాష్ట్రంలోని క‌రీంగంజ్ పేరును శ్రీ‌భూమిగా మారుస్తూ అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఈ మేర‌కు సిఎం హిమంత బిశ్వ‌శ‌ర్మ ఎక్స్ వేదిక‌గా వెల్ల‌డించారు. విశ్వ‌క‌వి ర‌వీంద్ర‌నాథ్ ఠాగూర్ వంద ఏళ్ల క్రితం క‌రీంగంజ్ గ‌డ్డ‌ను మా ల‌క్ష్మీగా అభివ‌ర్ణించార‌న్నారు. ఆయ‌న గౌర‌వార్ధం నేడు ఈ ప్రాంతానికి శ్రీ‌భూమిగా పేరు మారుస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. బిజెపి నేతృత్వంలో రాష్ట్ర ప్ర‌జ‌ల చిర‌కాల స్వ‌ప్నాన్ని నెర‌వేర్చింద‌ని, వారి ఆకాంక్ష‌లు ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో ప్ర‌తిబింబిస్తున్నాయ‌ని సిఎం వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.