నేష‌న‌ల్ బిల్డింగ్స్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ కార్పొరేష‌న్ లిమిటెడ్ లో పోస్టులు

NBCC: ఢిల్లీలోని నేష‌న‌ల్ బిల్డింగ్స్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌లో మేనేజిరియ‌ల్ పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు. విద్యార్హ‌త‌లు, ఉద్యోగానుభ‌వం, గ్రూప్ డిస్క‌ష‌న్, ఇంట‌ర్వ్యూల‌తో అభ్య‌ర్థ‌ల ఎంపిక జ‌రుగుతుంది. ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తుల‌ను డిసెంబ‌ర్ 20లోపు పంపించాలి. ద‌ర‌ఖాస్తు రుసుం రూ.1000గా నిర్ణ‌యించారు.ఎస్‌టి/ ఎస్‌సి అభ్య‌ర్థుల‌కు ఫీజు మిన‌హాయింపు ఉంది.

పోస్టుల వివ‌రాలు

చీఫ్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ (లా)-1

జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ (ఇంజినీరింగ్) -2

డిప్యూటి జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ (హెచ్ ఆర్ ఎం) -4

డిప్యూటి జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ (అర్కిటెక్చ‌ర్ అండ్ ప్లానింగ్)-1

అర్హ‌త:  పోస్టును భ‌ట్టి ఎల్ ఎల్‌బి, ఎల్ ఎల్ ఎం, సివిల్ ఇంజినీరింగ్‌, ఎంబిఎ, ఎంఎస్‌డ‌బ్ల్యూ, పిజి డిప్లొమా, ఆర్కిటెక్చ‌ర్ డిగ్రీతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వ‌య‌స్సు: ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ నాటికి చీఫ్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ పోస్టుకు 57 ఏళ్లకు మించ‌కూడ‌దు. జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ పోస్టుకు 54 ఏళ్లు, డిప్యూటి జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ కు 41 ఏళ్ల వ‌య‌స్సు ఉండాలి.

చీఫ్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌కు రూ.లక్ష నుండి రూ.2,60,000 వ‌ర‌కు ఉంది. జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌కు రూ. 90 వేల నుండి రూ. 2,40,000 వ‌ర‌కు ఉంది. డిప్యూటి జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ కు రూ.70వేల నుండి రూ.2ల‌క్ష‌ల వేత‌నం ఉంటుంది. పూర్తి విరాల‌కు అభ్య‌ర్థులు https://nbccindia.in/వెబ్‌సైట్ చూడ‌గ‌ల‌రు.

Leave A Reply

Your email address will not be published.