ప్రేమ కథలు చేయొద్దనుకున్నా.. సిద్దార్ద్
హైదరాబాద్ (CLiC2NEWS): తాను ఇపుడు తెలంగాణ అల్లుడిగా ఇక్కడున్నానని.. తన జీవితంలోకి అదితి రూపంలో దేవత వచ్చిందని హీరో సిద్ధార్ద్ అన్నారు. ఆయన నటించిన మిస్ యు సినిమా తమిళ, తెలుగు భాషల్లో విడుదలకానుంది. ఈ నేపథ్యంలో సిద్ధార్ద్ సోమవారం మీడియాతో మాట్లాడారు. 20 ఏళ్ల కిందట నువ్వొస్తానంటే నేనొద్దంటానా తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చానని.. ఈ 20 ఏళ్లు నాకు చాలా ఇచ్చిందన్నారు. ఈ సంక్రాంతి తనకు చాలా ముఖ్యమన్నారు. ఇక్కడ మీరు సినిమాలు ఎందుకు చేయట్లేదని అడుగుతున్నారు. ఆవిషయం మీరు సినిమాలు తీసే వాళ్లను అడగాలన్నారు. లవ్ ఫెయిల్యూర్ మూవీ తర్వాత ప్రేమ కథలు చేయొద్దని నిర్ణయించుకున్నాని.. 12 ఏళ్ల తర్వాత మిస్యు సినిమాతో వస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రం అందరికీ నచ్చితే కొత్త ప్రేమకథల ట్రెండ్ మొదలవుతందన్నారు. స్టార్ అవడం తన డ్రీమ్ కాదని.. తాను చనిపోతే , ఒక మంచి నటుడు లేడు అనిపించుకోవాలి అని ఈ సందర్బంగా సిద్దార్ద్ అన్నారు.