ఐఐసిటి, హైదరాబాద్‌లో 29 టెక్నీషియన్ పోస్టులు
IICT: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజి, హైదరాబాద్ లో 29 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తులను డిసెంబర్ 26వ తేదీలోపు పంపించాల్సి ఉంది. దరఖాస్తు రుసుం రూ.500గా నిర్ణయించారు. ఎస్‌సి, ఎస్‌టి , మహిళలకు ఫీజు మినహాయించారు. అభ్యర్థుల వయస్సు 28 ఏళ్లకు మించకూడదు. విద్యార్హతలు, అభ్యర్థుల షార్ట్‌లిస్టింగ్, ట్రేడ్ టెస్ట్‌ల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
ఎలక్ట్రీషియన్, మెకానికల్, ఫిట్టర్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ , లాబొరెటరీ అసిస్టెంట్ (కెమికల్ ప్లాంట్), మెకానిక్ (రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ ), మెకానిక్ -మోటార్ వెహికల్ , డ్రాప్ట్స్‌మన్ (సివిల్ ) విభాగాల్లో పోస్టులు కలవు. 55 శాతం మార్కులుతో పదోతరగతి లేదా తత్సమానం, సంబంధిత విభాగాల్లో ఐటిఐ ఉత్తీర్ణత ఉండాలి. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.iict.res.in/ వెబ్‌సైట్ చూడగలరు.