విద్యుత్ సామాగ్రికి బ‌దులు పార్శిల్‌లో మృత‌దేహం..

ఉండి (CLiC2NEWS): ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఉండి మండ‌లం లో యండ‌గండిలో ఓ ఇంటికి మృత‌దేహం పార్శిల్ వ‌చ్చింది. ఇంటి నిర్మాణం కోసం రావాలిసిన విద్యుత్ సామాగ్రి పార్శిల్‌లో మృత‌దేహం రావ‌డంతో స్థానికులు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. స‌మాచారం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ప‌రిశీలించారు. పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. యండ‌గండి గ్రామంలో సాగి తుల‌సి ఇంటి నిర్మాణం చేస్తున్నారు. ఇల్లు ప్లాస్టింగ్ చేస్తుండ‌గా.. ఆర్ధిక సాయం కోసం క్ష‌త్రియ సేవా స‌మితికి ఆమె ద‌ర‌ఖాస్తు చేశారు. మొద‌టి విడ‌త‌లో సేవా స‌మితి టైల్స్ అంద‌జేసింది. మ‌రోసారి ఆర్ధిక సాయం కోర‌గా.. పార్శిల్ విద్యుత్ సామాగ్రి రావాల్సి ఉంది. కానీ.. మృత‌దేహం వ‌చ్చింది. ఆ పార్శిల్ోల ఉత్త‌రం కూడా ఉన్న‌ట్లు స‌మాచారం. దానిలో రూ.1.30 కోట్లు చెల్లించాల‌ని, లేక‌పోతే ఇబ్బందులు ఎదుర్కుంటార‌ని పేర్కొన్నారు. దీంతో ఆ మ‌హిళ కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. పార్శిల్ పెట్టెలో సుమారు 45 ఏళ్లున్న గుర్తు తెలియ‌ని మ‌గ వ్య‌క్తి మృత‌దేహం స‌గ భాగం ఉన్న‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.