సెక్ష‌న్ 22A గురించి..

సెక్ష‌న్ 22A గురించి..

ప్ర‌భుత్వ‌, ప్ర‌జా ప్ర‌యోజ‌నార్దం కొన్ని ర‌కాల భూములు లేదా ఆస్తుల రిజిస్ట్రేష‌న్‌ను నిషేధించే ఒక ప్ర‌త్యేక‌మైన చ‌ట్ట‌ప‌ర‌మైన నిబంధ‌న‌. అంటే.. ఈ భూముల అమ్మ‌కం, బ‌దిలీ, గిప్ట్ ఇవ్వ‌డం తాక్టు పెట్ట‌డం వంటివి నిషేధం. ఇది రిజిస్ట్రేష‌న్ చ‌ట్టం 1908లోని సెక్ష‌న్ 22A.

భార‌త‌దేశంలో ముఖ్యంగా మ‌న తెలుగు రాష్ట్రాల్లో 22A అనేది ప్ర‌భుత్వ నిషేధిత జాబితాలో ఉన్న భూములు లేదా ఆస్తుల‌ను తెలియ‌జేస్తుంది. ఏదైనా భూమి లేదా ఆస్తి స‌ర్వే నంబ‌ర్.. ఈ 22ఎ నిషేధిత జాబితాలో ఉంటే, స‌బ్‌-రిజిస్ట్రార్ కార్యాల‌యం (SRO) ఆ ఆస్తికి సంబంధించిన ఎలాంటి రిజిస్ట్రేష‌న్ ప‌త్రాల‌నైనా తిర‌స్క‌రిస్తుంది.

నిషేధిత జాబితాలోకి వ‌చ్చే భూమ‌లు: 

ప్ర‌భుత్వ భూములు: కేంద్ర లేదా రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు, పోరంబోకు లేదా ప్ర‌భుత్వ సంస్థ‌ల‌కు చెందిన భూములు ఉంటాయి.

అసైన్డ్ భూములు : ప్ర‌భుత్వం పేద‌ల‌కు సాగు లేదా ఇళ్ల కోసం ఉచితంగా కేటాయించిన భూములు. వీటిని ఇత‌ర‌రుల‌కు విక్ర‌యించ‌డానికి కుద‌ర‌దు.

దేవాదాయ , వ‌క్ఫ్ బోర్డుల‌కు చెందిన ఆస్తులు : హింతూ దేవాల‌యాలు, చారిట‌బుల్ ట్ర‌స్ట్‌లు లేదా వ‌క్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్న ఆస్తులు.

సీలింగ్ మిగులు భూమ‌లు: భూగ‌రిష్ట ప‌రిమితి చ‌ట్టం ప్ర‌కారం ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకున్న మిగులు భూమ‌లు

కోర్టు వివాదాల‌లో ఉన్న భూములు లేదా ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఇత‌రుల‌కు అమ్మ‌డానికి వీలులేని ఆస్తులు: కోర్టు స్టేలు.. జ‌ప్తులో ఉన్న భూములు. లేదా.. ప్ర‌భుత్వం ప్ర‌త్యేక నోటిఫికేష‌న్ ద్వారా నిషేధించిన ఆస్తులు.

సాధారణంగా ఈ భూముల‌ను ఇత‌రుల‌కు రిజిస్ట‌ర్ కాకుండా .. వాటిని ఎవ‌రూ త‌మ పేరిట రాయించుకోవ‌డానికి వీలు లేకుండా ఈ సెక్ష‌న్ అడ్డుకుంటుంది. ఇది ప్ర‌భుత్వ భూముల‌ను కాపాడేందుకు తీసుకొచ్చిన చ‌ట్టం. 1999లో అప్ప‌టి ప్ర‌భుత్వం 1908 నాటి రిజిస్ట్రేష‌న్ల చ‌ట్టానికి స‌వ‌ర‌ణ చేసి ఈ సెక్ష‌న్ తెచ్చారు. కానీ.. అప్ప‌ట్లో హైకోర్టు దాన్ని కొట్టివేసింది. దానిని మ‌ళ్లీ 2007లో మ‌రోసారి చ‌ట్ట స‌వ‌ర‌ణ తెచ్చారు. అప్ప‌టి నుండి ఈ సెక్ష‌న్ అమ‌లులో ఉంది.

ప్ర‌స్తుతం స‌మ‌స్య‌..

ప్ర‌స్తుతం తెలంగాణ ప్ర‌భుత్వం 22ఎ జాబితాను అప్‌డేట్ చేయ‌డంతో చాలా మంది ప్రైవేటు ప‌ట్టా భూములు, నివాస స్థ‌లాలు, ఆపార్ట్‌మెంట్లు సైతం పొర‌పాటున నిషేధిత జాబితాలోకి చేరిన‌ట్లు స‌మాచారం. దీంతో ప్ర‌భుత్వానికి ఫిర్యాదులు కూడా అందాయి. దీంతో ప్ర‌భుత్వం అధికారుల పొర‌పాట్ల‌ను స‌రిదిద్దేందుకు ఉన్న‌త స్థాయి క‌మిటీల‌ను ఏర్పాటు చేసింది.

 

అధికారుల పొర‌పాట్ల వ‌ల‌న కొన్ని నిజ‌మైన ప్రైవేటు భూములు, ఇళ్లు కూడా పొర‌పాటున 22ఎ నిషేధిత జాబితాలో చేరాయి. దీంతో ఆ భూమ‌లు య‌జమానులు విక్ర‌యించ‌డానికి గానీ, బ‌దిలీ చేయ‌డానికి గానీ వీలు లేకుండా పోయింది. అంతేకాక‌, బ్యాంకు రుణాలు పొందేందుకు కూడా వీలు లేదు. ప్ర‌భుత్వం ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డాద‌నికి ప‌రిష్క‌రించేందుకు ప్ర‌త్యేక క‌మిటీల‌ను ఏర్పాటు చేసింది. ప్రేవేటు భూమి అని తేలితే త్వ‌ర‌గా క్లియ‌రెన్స్ ఇవ్వాల‌ని ఆదేశాలు కూడా జారీ చేసింది.

మీ భూములు కూడా ఒక‌వేళ 22ఎలో చేరితే..

భూమి కానీ , ఇల్లు కానీ అమ్మ‌డానికి వీలుండ‌దు. అదేవిధంగా కొన‌లేరు. ప‌వ‌ర్ ఆఫ్ అటార్నీ , తాకట్టు పెట్ట‌డం, గిప్ట్ డీడ్ కానీ చేసుకోవ‌డానికి వీలుండ‌దు. మీ భూముల‌పై ఏ బ్యాంకు లు అప్పులు ఇవ్వ‌వు.

మీ భూమి కానీ.. ఇల్లు కానీ 22ఎ జాబితాలో చేరిందో లేదో ఆన్‌లైన్ లో తెలుసుకువ‌చ్చు.

తెలంగాణ : ధ‌ర‌ణి Dharani పోర్ట‌ల్‌లో లేదా IGRS Telangana వెబ్‌సైట్ ద్వారా Prohibited Properties ఆప్ష‌న్ ఎంచుకొని స‌ర్వే నంబ‌ర్ (Survey Number) ఆధారంగా తెలుసుకోవ‌చ్చు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ (AP): AP Registration Portal లేదా Meebhoomi వెబ్‌సైట్ ఓపెన్ చేసి, మీ జిల్లా, మ‌డ‌లం, గ్రామం , మీ భూమి స‌ర్వే నెంబర్  (Survey Number) ఎంట‌ర్ చేసి 22ఎ జాబితాల‌తో ఉందో లేదో చెక్ చేసుకోవ‌చ్చు.

ప‌రిష్కారం: భూమి నిజ‌మైన య‌జ‌మాని త‌మ ప‌ట్టా దార్ పాస్‌బుక్ , లింక్ డాక్యుమెంట్లు , ఇసి (EC) మ‌రియు ఇత‌ర రెవెన్యూ రికార్డుల‌తో సంబంధిత జిల్లా క‌లెక్ట‌ర్ (DC) లేదా రెవెన్యూ డివిజిన‌ల్ అధికారికి (RDO)కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనిపై విచార‌ణ జ‌రిపిన అనంత‌రం రికార్డులు నిజ‌మైన‌వి అని తేలితే.. ప్ర‌భుత్వం ఆ భూమిని నిషేధిత జాబితా 22ఎ నుండి తొల‌గిస్తుంది.

 

Jobs: ఎన్‌సిఆర్‌టిసిలో 67 సూప‌ర్‌వైజ‌ర్ పోస్టులు

Leave A Reply

Your email address will not be published.